తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పిట్ట కథలు' ట్రైలర్ కోసం.. రాజశేఖర్​ మరో సినిమా - టాలీవుడ్ అప్డేట్స్

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. వీటిలో 'పిట్టకథలు' ట్రైలర్​, రాజశేఖర్​ మరో చిత్రం, 'పిప్పా', 'ఎనిమీ' సంగతులు ఉన్నాయి.

movie updates from pitta kathalu, Rajsekahr new movie, Enemy, Pippa, Mosagallu
'పిట్ట కథలు' ట్రైలర్ కోసం.. రాజశేఖర్​ మరో సినిమా

By

Published : Feb 4, 2021, 8:19 PM IST

*టాలీవుడ్​ యువ దర్శకులు నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి, నాగ్ అశ్విన్ తీస్తున్న నెట్​ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్​ 'పిట్ట కథలు'. టీజర్ ఇప్పటికే ఆకట్టుకుంటోంది. శుక్రవారం ట్రైలర్​ను విడుదల చేయనున్నారు. ఈనెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

*పుట్టినరోజు సందర్భంగా 'శేఖర్' సినిమా ప్రకటించిన ప్రముఖ నటుడు రాజశేఖర్​... మరో చిత్ర విశేషాలను ఈనెల 6న పంచుకోనున్నారు.

రాజశేఖర్ మరో కొత్త సినిమా

*'ఎనిమీ' సినిమాలో ఆర్య ఫస్ట్​లుక్​ గురువారం ఉదయం విడుదలైంది. ఇందులో విశాల్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఎనిమీ సినిమాలో ఆర్య ఫస్ట్​లుక్

*'పిప్పా' చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. 1971 యుద్ధ నేపథ్య కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇషాన్ కట్టర్, మృనాల్ ఠాకుర్ హీరోహీరోయిన్లు. రాజ్​కృష్ణ మేనన్ దర్శకుడు.

పిప్పా మూవీ టీమ్
మోసగాళ్లు సినిమాలో విష్ణు, కాజల్
.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details