తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరో ప్రేమకథలో విశ్వక్​సేన్.. 'హే సినామిక' పూర్తి - movie news

సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. వీటిలో విశ్వక్​సేన్ కొత్త చిత్రం, హే సినామిక, ఫాదర్ చిట్టి ఉమ కార్తిక్, నాగశౌర్య క్రిస్మస్​ సెలబ్రేషన్​ సంగతులు ఉన్నాయి.

movie updates latest
మరో ప్రేమకథలో విశ్వక్​సేన్.. 'హే సినామిక' పూర్తి

By

Published : Dec 28, 2020, 3:28 PM IST

*యువ హీరో విశ్వక్​సేన్.. మరో ప్రేమకథలో నటించనున్నారు. 'ఓ మై కడవులే'కు రీమేక్​గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఒరిజినల్​ తీసిన అశ్వత్ మరిముత్తు దర్శకుడు. తరుణ్ భాస్కర్ మాటలు రాస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నారు.

*దుల్కర్ సల్మాన్, కాజల్, అదితీ రావు హైదరీ కలిసి నటిస్తున్న 'హే సినామిక' షూటింగ్ పూర్తయింది. కొరియోగ్రాఫర్ బృంద.. ఈ తమిళ సినిమాతో దర్శకురాలిగా మారారు. త్వరలో విడుదల తేదీ వెల్లడించనున్నారు.

*యువ హీరో నాగశౌర్య.. దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. షూటింగ్​లో భాగంగానే క్రిస్మస్ వేడుకల్ని చేసుకున్నారు. ఈ చిత్రంతో హీరోయిన్​గా షెర్లీ సెటియా పరిచయమవుతోంది. ఆమె కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది.

*'ఫాదర్ కార్తిక్ చిట్టి ఉమ' సినిమాలో ఉమ పాత్ర ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. 'రాక్షసుడు' ఫేమ్ అభిరామి ఈ రోల్​లో వైద్య విద్యార్థిగా నటిస్తోంది. ప్రధాన పాత్రలో జగపతిబాబు చేస్తున్నారు.

*శ్రీవిష్ణు మరో చిత్రానికి గ్రీన్​ సిగ్నల్ ఇచ్చారు. ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామాకు ప్రదీప్ వర్మ అల్లూరి దర్శకుడు. జనవరి నుంచి షూటింగ్ మొదలు కానుంది.

విశ్వక్​సేన్ కొత్త సినిమా ప్రారంభం
హే సినామిక షూటింగ్ పూర్తి
శ్రీవిష్ణు కొత్త సినిమా
'ఫాదర్ కార్తిక్ చిట్టి ఉమ' సినిమాలో ఉమ ఫస్ట్​లుక్​

ABOUT THE AUTHOR

...view details