నేచురల్ స్టార్ నాని.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మరోసారి నటించనున్నారు. శుక్రవారం ఉదయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 'రాజారాణి' ఫేమ్ నజ్రియా.. ఈ చిత్రంతోనే తెలుగులోకి పరిచయమవుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకుడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందే ఈ సినిమా టైటిల్ను నవంబరు 21న విడుదల చేయనున్నారు.
దగ్గుబాటి రానా.. చాలా నెలల విరామం తర్వాత మళ్లీ షూటింగ్లో పాల్గొన్నారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు.