*శ్రీనివాసరెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'ముగ్గురు మొనగాళ్లు'. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనే కాన్సెప్ట్‌తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
'ముగ్గురు మొనగాళ్లు' ఫస్ట్‌లుక్.. ఓటీటీలో 'షెర్నీ' - ముగ్గురు మొనగాళ్లు ఫస్ట్‌లుక్
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ముగ్గురు మొనగాళ్లు, షెర్నీ, నల్లమల చిత్రాల సంగతులు ఇందులో ఉన్నాయి.
'ముగ్గురు మొనగాళ్లు' ఫస్ట్‌లుక్.. ఓటీటీలో 'షెర్నీ'
*బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'షెర్నీ'. విద్య ఇందులో నిజాయతీ గల అటవీశాఖ అధికారిగా నటించారు. ఇప్పుడు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేయనున్నారు. జూన్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు కానీ తేదీ వెల్లడించలేదు. అమిత్ మసుర్కర్ దర్శకత్వం వహించారు.
*'నల్లమల' టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో నాజర్ పాత్ర లుక్‌ను సోమవారం విడుదల చేశారు. రవిచరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.