తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జపనీస్​లో 'మిషన్ మంగళ్'.. టీజర్​తో 'దేవినేని' - దేవినేని టీజర్

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. వీటిలో 'మిషన్ మంగళ్', 'దేవినేని', 'బంగారు బుల్లోడు', 'జాంబీ రెడ్డి', 'క్రేజీ అంకుల్స్' చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie updates from mission mangal, devineni, bangaru bullodu, zombie reddy, crazy uncles
జపనీస్​లో 'మిషన్ మంగళ్'.. టీజర్​తో 'దేవినేని'

By

Published : Jan 15, 2021, 8:09 PM IST

Updated : Jan 15, 2021, 9:34 PM IST

*అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ 'మిషన్ మంగళ్' జపాన్ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 8న దాదాపు 40 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

మిషన్ మంగళ్ జపనీస్ రిలీజ్ పోస్టర్

*అల్లరి నరేశ్ 'బంగారు బుల్లోడు' సినిమాలోని 'యానం' పాట గ్లింప్స్ విడుదలైంది. జనవరి 23న థియేటర్లలో చిత్రం రిలీజ్ కానుంది. గిరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

*నందమూరి తారకరత్న నటిస్తున్న 'దేవినేని' టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాంగ్రీ లుక్​లో కనిపిస్తూ తారకరత్న ఆకట్టుకుంటున్నారు.

*'సూపర్​ ఓవర్' స్నీక్​పీక్​ను శర్వానంద్, 'జాంబీ రెడ్డి' నుంచి 'గో కరోనా' గీతం శనివారం ఉదయం విడుదల కానున్నాయి.

*శ్రీముఖి ప్రధాన పాత్రలో నటిస్తున్ 'క్రేజీ అంకుల్స్' త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్​ను విడుదల చేశారు.

క్రేజీ అంకుల్స్​ మూవీలో శ్రీముఖి
జాంబీ రెడ్డి సినిమా నుంచి గో కరోనా పాట
శర్వానంద్ చేతుల మీదుగా సూపర్​ ఓవర్ స్నీక్ పీక్

ఇవీ చదవండి:

Last Updated : Jan 15, 2021, 9:34 PM IST

ABOUT THE AUTHOR

...view details