>కోలీవుడ్ హీరో విజయ్ నటించిన 'మాస్టర్' తెలుగు టీజర్ వచ్చేసింది. ఆద్యంతం ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. అనిరుధ్ సంగీతమందించగా, లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. త్వరలో విడుదల తేదీపై స్పష్టతనిచ్చే అవకాశముంది.
>'కేజీఎఫ్ 2' షూటింగ్లో భాగంగా హైదరాబాద్‌లో ఉన్న బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. తన అభిమానులు మొక్కలు నాటాలని సవాలు విసిరారు.
>నాని 'టక్ జగదీష్' నుంచి కొత్త అప్డేట్ శుక్రవారం రానుంది. ఉదయం 10:35 గంటలకు ఆ విషయాన్ని వెల్లడిస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఇందులో రీతూవర్మ, ఐశ్వర్యరాజేశ్ హీరోయిన్లు. శివ నిర్వాణ దర్శకుడు.
>హీరో సందీప్ కిషన్ నిర్మిస్తున్న 'వివాహ భోజనంబు' షూటింగ్ పూర్తయింది. ఈ విషయమై ట్వీట్ చేసిన అతడు.. ఫస్ట్‌లుక్‌తో పాటు ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా చిత్రబృందం మొత్తానికి ధన్యవాదాలు చెప్పారు.
>సందీప్ కిషన్ 'రౌడీ బేబీ'లో బాబీ సింహా నటిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇందులో నేహాశర్మ హీరోయిన్గా కనిపించనుంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు.
>మెగా బ్రదర్ నాగబాబు.. 'ఈ కథలో పాత్రలు కల్పితం' టీజర్‌ను శుక్రవారం రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా పవన్‌తేజ్, మేఘన హీరోహీరోయిన్లుగా నటించారు.
>హాస్యనటుడు సప్తగిరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఎయిట్'. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దీనిని తెరకెక్కిస్తున్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సంజయ్ దత్
వివాహ భోజనంబు సినిమా పూర్తయిందని నిర్మాత సందీప్ కిషన్ ట్వీట్
రౌడీ బేబీలో కీలకపాత్రలో బాబీ సింహా
నాగబాబు చేతుల మీదుగా టీజర్ విడుదల