తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'లైగర్' అప్​డేట్.. అలరిస్తున్న 'నాట్యం' టీజర్​ - నాట్యం టీజర్ జూ.ఎన్టీఆర్

కొత్త సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో లైగర్, నాట్యం, వరుడు కావలెను, టక్ జగదీష్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్ చిత్ర సంగతులు ఉన్నాయి.

movie updates from LIGER, NATYAM, TUCK JAGADISH, VARUDU KAVALENU, MOST ELIGIBLE BACHELOR
'లైగర్' అప్​డేట్.. అలరిస్తున్న 'నాట్యం' టీజర్​

By

Published : Feb 10, 2021, 12:15 PM IST

*విజయ్ దేవరకొండ 'లైగర్' విడుదల తేదీని గురువారం ఉదయం 8:14 గంటలకు వెల్లడించనున్నారు. ఈ విషయాన్ని చెబుతూ పూరీ కనెక్ట్స్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకుడు.

*'నాట్యం' సినిమా టీజర్​ను హీరో జూ.ఎన్టీఆర్, బుధవారం విడుదల చేశారు. నృత్యకారిణి సంధ్యారాజ్ ప్రధాన పాత్రధారి. రేవంత్ కోరుకొండ దర్శకుడు. నృత్యకారిణి జీవితంలో ఇద్దరు యువకుల పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసిందనే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

*వాలంటైన్స్ డే కానుకగా ఈనెల 13న 'టక్ జగదీష్', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్', 'వరుడు కావలెను' సినిమాల నుంచి లిరికల్ సాంగ్స్ విడుదల కానున్నాయి.

టక్ జగదీష్ మూవీ
వరుడు కావలెను మూవీలో నాగశౌర్య, రీతూ వర్మ

*'ఏ1 ఎక్స్​ప్రెస్' సినిమా నుంచి 'అమిగో' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ లిరికల్ వీడియో విడుదలైంది. ఇందులో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లు. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details