తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'లైగర్' రీస్టార్ట్.. 'కిన్నెరసాని' థీమ్ వీడియో - MISSION MAJNU rashmika

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. వీటిలో విజయ్ దేవరకొండ 'లైగర్', సత్యదేవ్ 'గాడ్సే', 'మిషన్ మజ్ను', 'డాన్', 'కిన్నెరసాని' చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie updates from LIGER, GODSE, KINNERASANI, DON, MISSION MAJNU
'లైగర్' రీస్టార్ట్.. 'కిన్నెరసాని' థీమ్ వీడియో

By

Published : Feb 11, 2021, 12:20 PM IST

*విజయ్ దేవరకొండ 'లైగర్​' షూటింగ్ ముంబయిలో తిరిగి ప్రారంభమైంది. కరోనా లాక్​డౌన్ కారణంగా దాదాపు ఏడాదిపాటు చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్. పూరీ జగన్నాథ్ దర్శకుడు. రానున్న సెప్టెంబరు 9న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం.

లైగర్ షూటింగ్ తిరిగి ప్రారంభం

*సత్యేదవ్ 'గాడ్సే' సినిమా షూటింగ్ గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్​ను పంచుకున్నారు. గోపీగణేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

సత్యదేవ్ గాడ్సే సినిమా

*'మిషన్ మజ్ను' చిత్రీకరణలో హీరో సిద్ధార్థ్ మల్హోత్రా పాల్గొన్నారు. లక్నోలో జరుగుతున్న షూటింగ్​లో ఇప్పటికే హీరోయిన్ రష్మికపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. శంతన్ బాగ్చీ దర్శకుడు.

'మిషన్ మజ్ను'లో సిద్ధార్థ్, రష్మిక

*మెగాహీరో కల్యాణ్​దేవ్ పుట్టినరోజు కానుకగా 'కిన్నెరసాని' థీమ్​ వీడియోను విడుదల చేశారు. మరోవైపు తమిళ హీరో శివకార్తికేయన్ కొత్త చిత్రం 'డాన్' లాంఛనంగా మొదలైంది. త్వరలో షూటింగ్ షురూ కానుంది.

శివకార్తికేయన్ డాన్ సినిమా ప్రారంభోత్సవం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details