తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరోగా కొరియోగ్రాఫర్.. త్వరలో ఇర్ఫాన్ చివరి చిత్రం - krack cinema trailer

కొత్త సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో జే1, ద సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్, బ్లైండ్, క్రాక్, రెడ్ చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie updates from J1, krack, Blind, RED, The Song Of Scorpions
హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్.. త్వరలో ఇర్ఫాన్ చివరి చిత్రం

By

Published : Dec 28, 2020, 7:26 PM IST

*టాలీవుడ్​ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ.. హీరోగా మారారు. ఆయన నటిస్తున్న తొలి సినిమా 'జే1' సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. దిగంగన సూర్యవంశీ హీరోయిన్. మురళీ రాజ్ దర్శకుడు.

*బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ చివరి చిత్రం 'ద సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్' విడుదలకు సిద్ధమైంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. క్యాన్సర్​తో ఈ ఏడాది ఏప్రిల్ 29న తుదిశ్వాస విడిచారు.

*సోనమ్ కపూర్ నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'బ్లైండ్' సినిమా ప్రారంభమైంది. స్కాట్లాండ్​లో సోమవారం నుంచి షూటింగ్ మొదలైనట్లు చిత్రబృందం వెల్లడించింది. బ్లైండ్ పోలీస్ అధికారి, సీరియల్ కిల్లర్ మధ్య జరిగే కథతో తెరకెక్కిస్తున్నారు.

*రవితేజ, శ్రుతి హాసన్ నటిస్తున్న 'క్రాక్' సినిమా ట్రైలర్.. న్యూయర్​ కానుకగా రానుంది. సంక్రాంతికి థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

*రామ్ 'రెడ్' సినిమాలో 'డించక్ డించక్' పూర్తి వీడియో సాంగ్.. ఈనెల 30న విడుదల కానుంది. జనవరి 14న థియేటర్లలో చిత్రం రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

కొరియోగ్రాఫర్ జానీ కొత్త సినిమా పోస్టర్
ఇర్ఫాన్ ఖాన్ చివరి చిత్రం
సోనమ్ కపూర్ బ్లైండ్ సినిమా
క్రాక్ సినిమా ట్రైలర్
రెడ్ సినిమాలోని డించక్ డించక్ పూర్తి వీడియో

ABOUT THE AUTHOR

...view details