తెలంగాణ

telangana

By

Published : Dec 7, 2020, 5:11 PM IST

ETV Bharat / sitara

షూటింగ్​లో 'మహాసముద్రం'.. ప్లాంక్స్​తో 'క్రాక్' జోడీ

టాలీవుడ్​, బాలీవుడ్​ నుంచి కొత్త అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'కేజీఎఫ్ 2', 'మహాసముద్రం', 'క్రాక్', 'కరోనా వైరస్', 'ఆకాశం నీ హద్దురా' సినిమా యూనిట్లు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.

movie updates from corona virus, kgf 2, maha samudram, aakasham nee haddhura, krack etc..
షూటింగ్​లో 'మహాసముద్రం'.. ప్లాంక్స్​తో రవితేజ-శ్రుతిహాసన్

>'కేజీఎఫ్ 2' క్లైమాక్స్ షూటింగ్​తో దర్శకుడు ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారు. సెట్​లో ఫైట్​ మాస్టర్స్​తో కలిసి తీసుకున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో రాకీగా యష్, అధీరాగా సంజయ్ దత్​ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. దీని తర్వాత ప్రభాస్​తో కలిసి పనిచేయనున్నారు ప్రశాంత్ నీల్.

>ప్రేమకథతో తెరకెక్కుతోన్న 'మహాసముద్రం' షూటింగ్ ప్రారంభమైంది. సిద్ధార్థ్ సెట్​లోకి అడుగుపెట్టారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని పోస్ట్ చేసిన చిత్రబృందం.. ఈ విషయాన్ని వెల్లడించింది. శర్వానంద్, సిద్ధార్థ్, అదితీ రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకుడు.

>రామ్​గోపాల్ వర్మ 'కరోనా' సినిమా.. డిసెంబరు 11న థియేటర్లతో పాటు ఏటీటీలోనూ విడుదల కానుంది. దీనికి అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్లు భయపెడుతూనే ఆసక్తి కలిగిస్తున్నాయి.

>గోవాలో షూటింగ్ జరుపుకొంటున్న 'క్రాక్​' బృందం.. సమయాన్ని ఆస్వాదిస్తోంది. హీరోహీరోయిన్లు రవితేజ, శ్రుతిహాసన్.. ప్లాంక్స్​ చేయడంలో పోటీపడ్డారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

>ఇటీవల ఓటీటీలో విడుదలై హిట్​గా నిలిచిన సూర్య 'ఆకాశం నీ హద్దురా!'.. 25 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్​ను రిలీజ్​ చేశారు. అపర్ణ బాలమురళి హీరోయిన్​, సుధా కొంగర దర్శకత్వం వహించారు. జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు.

>బాలీవుడ్​ నటి రిచా చద్దా ప్రధాన పాత్రలో నటించిన 'షకీలా' నుంచి మరో పోస్టర్​ విడుదలైంది. 'ద సౌత్ ఇండియన్ సూపర్​స్టార్' పాత్రలో పంకజ్ త్రిపాఠి నటించారు. డిసెంబరు 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.

ఫైట్​ మాస్టర్స్​తో సెట్​లో కేజీఎఫ్ 2 దర్శకుడు ప్రశాంత్ నీల్
మహాసముద్రం షూటింగ్ ప్రారంభం
మహాసముద్రం సినిమా ఫస్ట్​లుక్ పోస్టర్
డిసెంబరు 11న కరోనా వైరస్ సినిమా విడుదల
ఆకాశం నీ హద్దురా! సినిమాకు 25 రోజులు పూర్తి
షకీలా సినిమాలో పంకజ్ త్రిపాఠి పోస్టర్
క్రాక్ సినిమా బృందం
.

ABOUT THE AUTHOR

...view details