తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హరికథలా 'బెల్​ బాటమ్' ట్రైలర్.. టీజర్​తో 'షకీలా' - నాగశౌర్య షెర్లీ సెటియా

కొత్త సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'బెల్ బాటమ్' ట్రైలర్, 'షకీలా' టీజర్, 'డర్టీ హరి' రెండో ట్రైలర్​తో పాటు పలు చిత్రాల విశేషాలు ఉన్నాయి.

movie updates from bell bottom, shakeela, dirty hari, naga shourya new cinema, dhanush karnan
హరికథలా 'బెల్​ బాటమ్' ట్రైలర్.. టీజర్​తో 'షకీలా'

By

Published : Dec 9, 2020, 2:49 PM IST

>థ్రిల్లర్​ కథతో తెరకెక్కిన కన్నడ సినిమా 'బెల్ బాటమ్'. అదే పేరుతో ఇప్పుడు తెలుగులో తీసుకొస్తున్నారు. డిసెంబరు 11న 'ఆహా' ఓటీటీలో రానున్న సందర్భంగా ట్రైలర్​ను బుధవారం విడుదల చేశారు. రిషబ్ శెట్టి, హరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించారు. జయతీర్థ దర్శకుడు.

>శృంగార తార షకీలా జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'షకీలా'. డిసెంబరు 25న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా టీజర్​ను బుధవారం రిలీజ్ చేశారు. ఇందులో రిచా చద్దా టైటిల్​ రోల్​ చేయగా, 'సౌత్ ఇండియన్ సూపర్​స్టార్'గా పంకజ్ త్రిపాఠి నటించారు.

>ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'డర్టీ హరి'. డిసెంబరు 18న రిలీజ్​ కానున్న నేపథ్యంలో రెండో ట్రైలర్​ను విడుదల చేశారు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్​ కథతో దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది.

>నాగశౌర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ బుధవారం నుంచి మొదలైంది. ఈ మేరకు చిత్రబృందం వీడియోను ట్వీట్ చేసింది. స్టైలిష్​ లుక్​తో కనిపించారు నాగశౌర్య. షెర్లీ సెటియా హీరోయిన్​గా తెలుగులోకి ఈ సినిమాతోనే ఎంట్రీ ఇస్తోంది. అనీష్ కృష్ణ దర్శకుడు.

>కోలీవుడ్ హీరో ధనుష్.. 'కర్ణన్' చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా యూనిట్​ మొత్తానికి ధన్యవాదాలు చెప్పారు. ఫొటోను ట్వీట్ చేశారు.

>అశోక్ గల్లా, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థతో పాటు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు.

ధనుష్ కర్ణన్ సినిమా షూటింగ్ పూర్తి
అశోక్-నిధి అగర్వాల్ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం
గురువారం 'క్రాక్' రెండో పాట గురించి ప్రకటన

ABOUT THE AUTHOR

...view details