తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జనవరి రేసులో బుల్లోడు.. ట్రైలర్​తో వైట్ టైగర్ - సినిమా న్యూస్

కొత్త సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'బంగారు బుల్లోడు', 'సోలో బ్రతుకే సో బెటర్', 'ద వైట్ టైగర్', 'డాక్టర్ జీ'తో పాటు పలు చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie updates from bangaru bullodu, the white tiger, Doctor G, The Secret Garden, Chandigarh Kare Aashiqui, solo brathuke so better
జనవరి రేసులో బుల్లోడు.. ట్రైలర్​తో వైట్ టైగర్

By

Published : Dec 22, 2020, 6:11 PM IST

*అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న 'బంగారు బుల్లోడు' సినిమాను వచ్చే నెల(జనవరి)లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్​ను విడుదల చేసింది. పూజా జవేరి హీరోయిన్. గిరి దర్శకత్వం వహిస్తున్నారు.

*'సోలో బ్రతుకే సో బెటర్' ఈనెల 25న విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా మరో శ్లోకాన్ని పోస్ట్ చేశారు. ఇందులో సాయితేజ్, నభా నటేశ్ హీరోహీరోయిన్లు. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నా.

*బాలీవుడ్​ యువహీరో ఆయుష్మాన్ ఖురానా.. 'డాక్టర్ జీ' సినిమాలో నటించనున్నారు. ఇతడి మరో చిత్రం 'చండీగఢ్ కరే ఆషికి' షూటింగ్ 48 రోజుల్లో పూర్తయింది. వాణీ కపూర్​ హీరోయిన్, అభిషేక్ కపూర్ దర్శకుడు.

*ప్రియాంక చోప్రా, రాజ్​కుమార్ రావ్, హరీశ్ గౌర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'ద వైట్ టైగర్' ట్రైలర్ విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకుంటూ అంచనాల్ని పెంచుతోంది. త్వరలో నెట్​ఫ్లిక్స్​లో ప్రేక్షకులను పలకరించనుందీ సినిమా.

*షకలక శంకర్ మెయిన్ రోల్​లో నటించి 'బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది' ట్రైలర్​ను మంగళవారం రిలీజ్​ చేశారు. కామెడీ ఎంటర్​టైనర్​గా దీనిని తెరకెక్కించారు.

బంగారు బుల్లోడు జనవరిలో విడుదల
ఆయుష్మాన్ కొత్త సినిమా షూటింగ్ పూర్తి
ఆయుష్మాన్ ఖురానా 'డాక్టర్ జీ'
రెడ్ ట్రైలర్ 24వ తేదీ ఉదయం విడుదల
సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కొత్త శ్లోకం
గర్జన సినిమా నుంచి తొలి లిరికల్ బుధారం విడుదల
ద సీక్రెట్ గార్డెన్ సినిమా జనవరి 8న థియేటర్లలో విడుదల

ABOUT THE AUTHOR

...view details