తెలంగాణ

telangana

By

Published : Nov 28, 2020, 2:10 PM IST

ETV Bharat / sitara

'కూలీ నం.1' ట్రైలర్.. అక్షయ్​తో తొలిసారి అర్షద్

సినిమాల కొత్త అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో అక్షయ్ కుమార్ 'బచ్చన్ పాండే', భూమి పెడ్నేకర్ 'దుర్గమతి', వరుణ్- సారా 'కూలీ నం.1' చిత్రాలకు సంబంధించిన వార్తలు ఉన్నాయి.

movie updates from bachchan pandey, coolie no.1, durgamathi, gaali sampath
'కూలీ నం.1' ట్రైలర్.. అక్షయ్​తో తొలిసారి అర్షద్

>స్టార్ హీరోహీరోయిన్ వరుణ్ ధావన్, సారా అలీఖాన్ నటిస్తున్న 'కూలీ నం.1' ట్రైలర్ శనివారం విడుదలైంది. ఆద్యంతం నవ్వులూ పూయిస్తూ ఆకట్టుకుంటోంది. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ 45వ చిత్రమిది. క్రిస్​మస్ కానుకగా క్రిస్​మస్ 25 నుంచి అమెజాన్​ ప్రైమ్​లో స్ట్రీమింగ్ కానుంది.

>'బచ్చన్ పాండే' సినిమా కోసం అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్​తో అర్షద్ వార్సీ తొలిసారి కలిసి పనిచేయనున్నారు. యాక్షన్ కామెడీ ఎంటర్​టైనర్​ షూటింగ్ వచ్చే జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఫర్హాద్ సంజీ దర్శకుడు.

>'భాగమతి' హిందీ రీమేక్ 'దుర్గమతి' నుంచి ఓ పాట విడుదలైంది. 'బరస్ బరస్' అంటూ సాగే ఈ గీతం శ్రోతల్ని అలరిస్తోంది. ఇందులో భూమి పెడ్నేకర్ టైటిల్ రోల్ చేసింది. డిసెంబరు 11 నుంచి అమెజాన్ స్ట్రీమ్ కానుందీ సినిమా.

>శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న 'గాలి సంపత్' చిత్రబృందం నుంచి కొత్త పోస్టర్​ను విడుదల చేశారు. 'షూటింగ్ సాగుతోంది' అనే క్యాప్షన్​ను జోడించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కథను అందించడం సహా నిర్మిస్తున్నారు.

>'ఓదెల రైల్వేస్టేషన్​' సినిమా నుంచి ఐపీఎస్ అనుదీప్​ పాత్ర ఫస్ట్​లుక్​ను అభిమానులతో పంచుకున్నారు. ఈ రోల్​లో సాయి రోనక్​ నటిస్తున్నారు. దర్శకుడు సంపత్​ నంది కథనందిస్తుండగా, హెబ్బా పటేల్, వశిష్ట సింహా తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

అక్షయ్ కుమార్- ఫర్హాద్ సంజీ- అర్షద్ వార్సీ
గాలి సంపత్ సినిమాలో శ్రీవిష్ణు
ఓదెల రైల్వేస్టేషన్​ సినిమాలో సాయి రోనక్ ఫస్ట్​లుక్

ABOUT THE AUTHOR

...view details