తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పుష్ప' టీజర్​ మరో రికార్డు.. 'చెక్' ఓటీటీ డేట్ ఖరారు - పుష్ప టీజర్ రికార్డు

టాలీవుడ్​ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అన్నాత్తే, పుష్ప, చెక్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

movie updates from annaatthe, check, pushpa
మూవీ అప్డేట్స్

By

Published : May 12, 2021, 3:48 PM IST

Updated : May 12, 2021, 4:47 PM IST

*'అన్నాత్తే' షూటింగ్​ పూర్తి చేసుకున్న సూపర్​స్టార్ రజనీకాంత్.. చెన్నైలోని తన నివాసానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బుధవారం, హైదరాబాద్​ నుంచి చెన్నై వెళ్లారు. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సూపర్​స్టార్ రజనీకాంత్

*నితిన్ 'చెక్' ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. మే 14 నుంచి 'సన్ నెక్స్ట్'లో స్ట్రీమింగ్ కానుంది. అనుకోని కారణాల వల్ల ఉగ్రవాదిగా ముద్రపడి జైలుకెళ్లిన ఓ యువకుడు.. బయటకు ఎలా వచ్చాడు? ఆ తర్వాత ఏం చేశాడు? అనే కథతో ఈ సినిమా తీశారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు.

*యూట్యూబ్​లో పలు రికార్డులు సృష్టించిన 'పుష్ప' హీరో ఇంట్రో వీడియో.. ఇప్పుడు మరో మార్క్​ను అందుకుంది. టాలీవుడ్​లో అత్యంత వేగంగా 1.5 మిలియన్​ లైక్స్​ సాధించిన వీడియోగా నిలిచింది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక నటిస్తున్నారు. సుకుమార్ దర్శకుడు.

Last Updated : May 12, 2021, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details