థాయ్‌లాండ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నా ప్రభుత్వం సోమవారం నుంచి లాక్డౌన్లో మరిన్ని సడలింపులు ఇచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో సినిమా హాళ్లను మూసేసి.. పలు క్రీడా టోర్నీలను వాయిదా వేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాజాగా సోమవారం ఉదయం నుంచి థియేటర్లను పునఃప్రారంభించారు.
తెరుచుకున్న థియేటర్లు.. క్యూ కట్టిన జనం
కరోనా కారణంగా ఆగిపోయిన క్రీడా టోర్నీలు.. మూసేసిన థియేటర్లు థాయ్‌లాండ్‌లో తిరిగి ప్రారంభమయ్యాయి. ఆ దేశ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరోగ్య భద్రత పాటిస్తూ సోమవారం ఉదయం నుంచి సినిమాలను ప్రదర్శిస్తున్నారు.
ఆ దేశంలో సినిమా సందడి మొదలయ్యింది
థాయ్‌లాండ్‌లో 15 థియేటర్లలో 7 సినిమా హాళ్లను తెరచి రోజుకు మూడు షోలను ప్రదర్శించనున్నారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా థియేటర్లను, రెస్టారెంట్లను, రైల్వేస్టేషన్లను పారిశుద్ధ్య సిబ్బంది శానిటైజ్ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ.. ప్రజలు మాస్క్‌లను, భౌతిక దూరాలను పాటిస్తున్నారు.
ఇదీ చూడండి... ముజఫర్‌పుర్ బాలుడ్ని దత్తత తీసుకున్న షారుక్