తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కంగన 'ధాకడ్' విడుదల తేదీ.. యమ స్పీడుగా 'ముంబయికర్'

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో కంగనా రనౌత్ 'ధాకడ్', ముంబయికర్, బంగారు బుల్లోడు, ఫాదర్ చిట్టి ఉమ కార్తిక్ చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie news latest from tollywood, bollywood
కంగన 'ధాకడ్' విడుదల తేదీ.. యమ స్పీడుగా 'ముంబయికర్'

By

Published : Jan 18, 2021, 6:49 PM IST

*కంగనా రనౌత్ 'ధాకడ్' విడుదల తేదీ ఖరారైంది. ఈ ఏడాది అక్టోబరు 1న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. రజనీష్ ఘాయ్ దర్శకుడు. కత్తి పట్టుకుని ఉన్న కంగన ఫొటో.. చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది.

కంగనా రనౌత్ ధాకడ్ సినిమా

*అల్లరి నరేశ్ 'బంగారు బుల్లోడు' ట్రైలర్​.. మంగళవారం సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నారు. ఇందులో నరేశ్​ సరసన పూజా జావేరి నటిస్తోంది. గిరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

అల్లరి నరేశ్ బంగారు బుల్లోడు మూవీ

*'నగరం' సినిమాకు బాలీవుడ్ రీమేక్​ 'ముంబయికర్' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. విజయ్ సేతుపతి, విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ శివన్ దర్శకుడు.

ముంబయికర్ షూటింగ్​లో దర్శకుడు సంతోష్ శివన్

*జగపతి బాబు, కార్తిక్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఫాదర్ చిట్టి ఉమ కార్తిక్'. ఫిబ్రవరి 12న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ సినిమాకు విద్యాసాగర్ రాజ్ దర్శకత్వం వహించారు.

ఫాదర్ చిట్టి ఉమ కార్తిక్ మూవీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details