*హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఉమ'. కోల్‌కతాలో సోమవారం నుంచి షూటింగ్ మొదలైంది. యాడ్ ఫిల్మ్ మేకర్ తతఘత సింఘా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో టినూ ఆనంద్, గౌరవ్ శర్మ తదితరలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
*సంతోష్ శోభన్ హీరోగా, నందినిరెడ్డి దర్శకత్వంలోని సినిమాను ప్రకటించారు. 'అన్నీ మంచి శకునములే' టైటిల్‌తో దీనిని తెరకెక్కిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తుండగా, స్వప్నదత్ నిర్మిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
*మరో దక్షిణాది సినిమా బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసిన 'యూటర్న్'ను అదే పేరుతో హిందీలోనూ రూపొందించనున్నారు. సోమవారం అధికారిక ప్రకటన వచ్చింది. ఆలయా ఎఫ్ ప్రధాన పాత్రలో నటించనుంది. ఆరిఫ్ ఖాన్ దర్శకుడు. ఏక్తాకపూర్-శోభాకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మంగళవారం నుంచి చిత్రీకరణ ప్రారంభించనున్నారు.