గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హాస్యనటుడు వివేక్(60) శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన అకాల మరణంతో చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. మరోవైపు పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వివేక్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని వారు పేర్కొన్నారు.
ప్రముఖ నటుడు వివేక్ అకాల మరణం.. చాలా మందిని బాధపెట్టింది. అతని కామిక్ టైమింగ్, ఇంటెలిజెంట్ డైలాగులు ప్రజలను అమితంగా అలరించాయి. అతని సినిమాలతో పాటు జీవితంలోనూ.. పర్యావరణం, సమాజం పట్ల ఆయనకున్న సేవాభావం మరువలేనిది. ఆయన కుటుంబానికి, స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఓం శాంతి.
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
"నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" - మోహన్‌లాల్
"ప్రముఖ హాస్యనటుడు వివేక్ మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు"
- సమంత
"మీరు ఇకపై మా మధ్య ఉండరనే వార్తను నేను నమ్మలేకపోతున్నా. మిమ్మల్ని మేము ఎంతో మిస్ అవుతాం. మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు"
- హన్సిక
"నా అభిమాన నటుడు, ఎవరి నుంచి అయితే నేను స్ఫూర్తి పొందానో అలాంటి గొప్ప వ్యక్తి ఇకలేరు అనే వార్త నన్ను ఎంతో కలచివేసింది. దేవుడు ఆయన కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటున్నా"
- శ్రీనువైట్ల
"మాలో ఎన్నో మంచి ఆలోచనలు రేకెత్తించినందుకు, వైవిధ్యమైన నటనతో మమ్మల్ని మనసారా నవ్వించినందుకు థ్యాంక్యూ మై డియర్ ఫ్రెండ్ వివేక్. ఇకపై నిన్ను ఎంతో మిస్ అవుతా"
- ప్రకాశ్‌రాజ్
"మీ మరణవార్త నన్ను ఎంతగానో బాధకు గురి చేసింది. మిస్ యూ సర్. మీ మరణం చిత్రపరిశ్రమకు పెద్ద లోటు"