తెలంగాణ

telangana

By

Published : Jun 26, 2021, 12:20 PM IST

Updated : Jun 26, 2021, 2:28 PM IST

ETV Bharat / sitara

MAA ELECTIONS: 'నాగబాబు వ్యాఖ్యలు తప్పుబట్టిన నరేశ్'

'మా'(Movie Artists Association) మసకబారిందన్న నాగబాబు వ్యాఖ్యలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేశ్(Naresh) తప్పుబట్టారు. ఆయన మాటలు తనను బాధించాయని అన్నారు. ఒకేసారి పోటీ చేస్తానని గెలిచినప్పుడే చెప్పానని గుర్తుచేశారు. ఒక మార్పు తేవాలని పోటీ చేసినట్లు స్పష్టం చేశారు. మా అసోసియేషన్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

Naresh, Hero Naresh, Artist Naresh, Our President Naresh
నరేశ్, హీరో నరేశ్, ఆర్టిస్ట్ నరేశ్, మా అధ్యక్షుడు నరేశ్

తనకు కథలు చెప్పే అలవాటు లేదని.. అందుకే కాగితాలతో వచ్చానని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష్(మా(Movie Artists Association)) అధ్యక్షుడు నరేశ్(Naresh) అన్నారు. జీవితంలో తనను అధ్యక్షుడు కాలేరని ఎంతో మంది అన్నా కూడా.. ఒక మార్పు తేవాలని పోటీ చేసి గెలిచానని తెలిపారు. తాను సినిమా బిడ్డనని.. సినీ కళాకారుల కష్టాలు తనకు తెలుసని చెప్పారు. మా అసోసియేషన్ నుంచి తామంతా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అసోసియేషన్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు నరేశ్ ప్రకటించారు.

నాగబాబు వ్యాఖ్యలు బాధించాయి

ప్రకాశ్​రాజ్ నాకు మిత్రుడు..

ప్రకాశ్ రాజ్ తనకు బంధుమిత్రుడన్న నరేశ్(Naresh) .. 3 నెలల క్రితం ఫోన్‌చేసి పోటీ చేస్తున్నట్లు చెప్పారని తెలిపారు. మంచు విష్ణు కూడా పోటీ చేస్తున్నారని అన్నారు. ఒకేసారి పోటీ చేస్తానని నేను గెలిచినప్పుడే చెప్పానని గుర్తుచేశారు.

ఆ మాటలు బాధించాయి..

'మా(Movie Artists Association)' అనేది రాజకీయ వ్యవస్థ కాదని నరేశ్ ఉద్ఘాటించారు. ఎంతోమంది పెద్దలు ఇటుకా ఇటుకా పేర్చి 'మా' ఏర్పాటు చేశారని అన్నారు. 'మా'లో ఇన్సూరెన్స్ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. 'మా' మసకబారిందన్న నాగబాబు వ్యాఖ్యలు తప్పుబట్టిన నరేశ్(Naresh) .. ఆయన మాటలు బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండేళ్లు అసమర్థత ఉన్నమాట వాస్తవం. పెద్దలందరూ దృష్టి సారించి విబేధాలు నిలిపివేశారు. 'మా' మసకబారిందా? ముందడుగు వేస్తుందా?. నాగబాబు అలా మాట్లాడటం 'మా' నిబంధనలను ధిక్కరించినట్లే. ఏప్రిల్ 9వ తేదీన ప్రకాశ్‌రాజ్ 'మా'కు లేఖ రాశారు. ప్రకాశ్‌రాజ్ లేఖకు ఏప్రిల్ 12న సమాధానం ఇచ్చాం. 'మా' సభ్యులను చూసి ప్రకాశ్‌రాజ్ షాక్ అయ్యారు. 'మా'లో 914 మంది జీవితకాల సభ్యులు ఉన్నారు. 'మా(Movie Artists Association)'లో 29 మంది అసోసియేట్ సభ్యులు ఉన్నారు. 700 మంది సభ్యుల ఇంటింటికి వెళ్లి సర్వే చేశాం. 728 మందికి రూ.3 లక్షల చొప్పున జీవిత బీమా చేయించాం. 16 మంది చనిపోతే సుమారు రూ.50 లక్షలు అందించాం. 314 మందికి తొలిసారిగా వైద్య బీమా కల్పించాం. 'మా' చరిత్రలో ఇంతమందికి ఎప్పుడైనా బీమా చేయించారా?. పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచాం. పొట్టి వీరయ్య చనిపోతే ఆయన కుమార్తెకు పింఛను బదిలీ సభ్యత్వ నమోదు ఫీజును రూ.లక్ష నుంచి రూ.90 వేలకు తగ్గించాం.సీసీసీకి లక్ష విరాళం ఇచ్చాం.. చిరంజీవి అభినందించారు. విజయనిర్మల ప్రతినెలా రూ.15 వేలు పంపించేవారు. 'మా'లో నిధుల కొరత ఉంటే విజయనిర్మల రూ.5 లక్షలు ఇచ్చారు. ఇప్పటివరకు 'మా'కు విజయనిర్మల రూ.30 లక్షలు ఇచ్చారు.

- నరేశ్, 'మా' అధ్యక్షుడు

కరోనా కాలంలో రూ.30 లక్షల విరాళం..

'మా'(Movie Artists Association)లో కొత్తగా 87 మందికి సభ్యత్వం ఇచ్చినట్లు నరేశ్(Naresh) తెలిపారు. వృద్ధ కళాకారులు అవకాశాలు అడిగేవారని, జాబ్ కమిటీ ద్వారా వారికి సినిమాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 35 మంది వృద్ధ కళాకారులకు అవకాశాలు ఇప్పించామని వెల్లడించారు. కరోనా సమయంలో 'మా'కు రూ.30 లక్షల విరాళాలు అందినట్లు.. వాటిని కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన కళాకారులకు అండగా ఉండేందుకు ఉపయోగించినట్లు తెలిపారు.

Last Updated : Jun 26, 2021, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details