తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పెళ్లి చేసుకున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ - మౌనీరాయ్ వెడ్డింగ్

Mouni roy wedding: హిందీలో సీరియల్స్, సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటి మౌనీరాయ్ వివాహం సూరజ్ నంబియార్​తో గురువారం జరిగింది. హిందు సంప్రదాయ పద్ధతిలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

Mouni roy wedding
మౌనీరాయ్ వెడ్డింగ్

By

Published : Jan 27, 2022, 12:14 PM IST

Mouni roy husband: బాలీవుడ్ నటి, 'నాగిని' సీరియల్ ఫేమ్ మౌనీరాయ్ పెళ్లి చేసుకుంది. దుబాయ్​ చెందిన యువ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్​తో ఏడడుగులు వేసింది. గోవాలో ఈ ఈవెంట్​ హిందు సంప్రదాయ పద్ధతిలో జరిగింది. మౌనీ మెడల్ సూరజ్​ మూడు ముళ్లు వేశారు.

భర్త సూరజ్​తో మౌనీరాయ్

ఈ జంట తెల్లని దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ జోడీకి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. మందిరా బేడీ, అర్జున్ బిజలానీ లాంటి నటీనటులకు పెళ్లికి హాజరై వధూవరులను దీవించారు.

పెళ్లి దుస్తుల్లో మౌనీరాయ్

ABOUT THE AUTHOR

...view details