బాలీవుడ్ నటి మౌనీ రాయ్ గురించి ఇప్పుడిప్పుడే అందరూ మాట్లాడుకుంటున్నారు. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన కథానాయిక మౌనీ. ప్రస్తుతం 'మేడ్ ఇన్ చైనా' చిత్రంలో రాజ్‌కుమార్ రావ్ సరసన నటిస్తోంది. సినిమాకు సంబంధించిన ప్రచార కారక్రమంలో ఈ హీరోయిన్ పలు విషయాలను మీడియాతో పంచుకుంది.
"నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. అయితే తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చే స్నేహితులు ఎవరూ లేరు. ఎందుకంటే నేను రాత్రిపూట తొందరగానే నిద్రపోతాను. తొందరగా మంచమెక్కుతాను..కోడి కూచే వేళకి మంచం దిగుతా. కాబట్టి 3 గంటలకు వచ్చే స్నేహితులు నాకు లేరు. నేనొక నియమం పెట్టుకున్నా. ముందుగా పడుకోవడం.. ఉదయాన్నే నిద్ర లేవడం.." అంటూ చెప్పకొచ్చింది.