సోషల్‌మీడియా.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఎంతో కొంత సమాచారాన్ని ఈ సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. ఇంతటి ప్రాచుర్యం పొందిన సోషల్‌మీడియానే రాజకీయ నాయకుల దగ్గర్నుంచి సినిమా వాళ్ల దాకా ప్రచార సాధనంగా ఉపయోగించుకుంటున్నారు.
అలా సామాజిక మాధ్యమాలపై ప్రజల్లో ఏర్పడిన క్రేజ్‌తో.. విడుదలయ్యే ప్రతి చిత్రానికి సంబంధించిన సమాచారాన్ని వీటి ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాయి చిత్రబృందాలు. సినిమాలకు సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్లతో పాటు ట్రైలర్‌నూ సోషల్‌మీడియాలో విడుదల చేసి.. చిత్రానికి తగిన ప్రచారం పొందుతున్నాయి. ఈ విధంగా స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన టీజర్ లేదా ట్రైలర్లు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.
ఇటీవలే విడుదలైన నందమూరి బాలకృష్ణ 'అఖండ' టీజర్ యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తోంది. 50 మిలియన్ల మార్క్‌ను అధిగమించింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ చరిత్రలో యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలు సాధించిన టాప్-5 చిత్ర టీజర్లు ఏవో చూద్దాం?
1. పుష్ప: 54 మిలియన్ ప్లస్ వ్యూస్
2. 'ఆర్ఆర్ఆర్' రామరాజు ఫమ్ భీమ్: 50.70 మిలియన్ల వ్యూస్