తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కెరీర్ లైఫ్ ఓకే.. మ్యారేజ్ లైఫ్ ఓ టెన్షన్' - మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్ తాజా వార్తలు

అక్కినేని హీరో అఖిల్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్'. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ప్రీ టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

Most Eligible bachelor pre teaser looks impressive
'కెరీర్ లైఫ్ ఓకే.. మ్యారేజ్ లైఫ్ ఓ టెన్షన్'

By

Published : Oct 19, 2020, 12:13 PM IST

"ఒక అబ్బాయి లైఫ్‌లో 50శాతం కెరీర్‌.. 50 శాతం మ్యారేజ్‌ లైఫ్‌. కెరీర్‌ను సూపర్‌గా సెట్‌ చేశా. కానీ, ఈ మ్యారేజ్‌ లైఫే.." అంటూ నిట్టూరుస్తున్నాడు యువ కథానాయకుడు అఖిల్‌. ఇతడు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో హర్ష అనే పాత్రలో అఖిల్‌ కనిపించనున్నాడు. పూజాహెగ్డే హీరోయిన్.

కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. "కెరీర్‌ విషయంలో హర్ష సూపర్‌ హ్యాపీగా ఉన్నారు. కానీ, మ్యారేజ్‌ లైఫ్‌ విషయంలోనే ఆయన ఎంతో టెన్షన్‌గా ఉన్నారు" అని చిత్ర నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్‌ పేర్కొంది. పూర్తి టీజర్‌ అక్టోబర్‌ 25వ తేదీ ఉదయం 11.40 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details