తెలంగాణ

telangana

షాపింగ్​మాల్​లో అఖిల్​.. వైజాగ్​లో వరుణ్​

By

Published : Feb 25, 2020, 8:23 AM IST

Updated : Mar 2, 2020, 12:04 PM IST

టాలీవుడ్​ యువ కథానాయకులు వరుణ్​తేజ్​, అఖిల్​ అక్కినేని కొత్త చిత్రాల షూటింగ్​ శరవేగంగా జరుగుతుంది. ఈ 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్'​ హైదరాబాద్​లో, వైజాగ్​లో బాక్సర్​ వరుణ్​తేజ్​ సందడి చేస్తున్నారు.

Most eligible bachelor, #varun10 movies shooting started
షాపింగ్​మాల్​లో అఖిల్​.. వైజాగ్​లో వరుణ్​

అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయిక. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. షాపింగ్‌ మాల్‌ నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే హీరోహీరోయిన్​ల ఫస్ట్​లుక్స్‌ని విడుదల చేశారు. అఖిల్‌, పూజా హెగ్డేల మధ్య కెమిస్ట్రీ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలవబోతోందని చిత్రవర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు గోపీసుందర్‌ స్వరాలు అందిస్తున్నాడు.

మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్‌ బాక్సింగ్‌ రింగ్‌లోకి దిగాడు. ఇక పంచ్‌ విసరడమే ఆలస్యం. అతడు కథానాయకుడిగా, బాక్సింగ్‌ ప్రధానంగా సాగే సినిమాలో నటిస్తున్నాడు. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడిగా, అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం విశాఖపట్టణంలో మొదలైంది. ఇటీవలే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా బాక్సింగ్​లో శిక్షణ పొందాడు వరుణ్. ఫిట్‌నెస్‌ పరంగా జాగ్రత్తలు తీసుకొని రంగంలోకి దిగాడు. నాయికగా బాలీవుడ్‌ భామ సయీ మంజ్రేకర్‌ ఎంపికైనట్టు సమాచారం.

ఇదీ చూడండి.. ఫొటోగ్రాఫర్​తో హీరోయిన్ బాడీగార్డ్ దురుసు ప్రవర్తన

Last Updated : Mar 2, 2020, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details