తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అఖిల్​ కొత్త సినిమాలో సూపర్​ సీన్ కట్ చేశారే! - అఖిల్ కొత్త సినిమా

అఖిల్ అక్కినేని(akkineni akhil new movie), పూజా హెగ్దే జంటగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్' సినిమా(Most Eligible bachelor movie) విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ సినిమాకు సంబంధించిన ఓ డిలిటెడ్​ సీన్​ను సోషల్​ మీడియా వేదికగా విడుదల చేసింది చిత్రబృందం.

akhil akkineni
అఖిల్ అక్కినేని

By

Published : Oct 24, 2021, 5:31 AM IST

అఖిల్‌(akkineni akhil new movie), పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'(Most Eligible Bachelor Movie). బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించారు. నిడివి ఎక్కుకకావడం వల్ల చిత్రబృందం ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని తొలగించింది. వాటిల్లోని ఓ సీన్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా తాజాగా విడుదల చేసింది. 'పెళ్లి చూపులు' నేపథ్యంలో సాగుతుందీ సన్నివేశం.

'యు.ఎస్‌ బ్యాచ్‌ చేతులెత్తండి.. భీమవరం బ్యాచ్‌ చేతులెత్తండి' అంటూ సుడిగాలి సుధీర్‌ ఇందులో సందడి చేశారు. మరోవైపు, పెళ్లిచూపులు చూడటానికి వచ్చిన అమ్మాయితో అఖిల్‌ వినోదం పంచాడు. ఆ అమ్మాయి, ఆమె పనిమనిషిని ఉద్దేశించి అఖిల్‌ చెప్పిన మాటలు సరదాగా సాగాయి. ఈ సీన్‌లో అఖిల్‌ హావభావాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ వీడియో చూస్తే 'అరే.. మంచి సీన్‌ కట్‌ చేశారే' అనిపించకమానదు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది.

ABOUT THE AUTHOR

...view details