టాలీవుడ్ నటుడు విష్ణు మంచు కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'మోసగాళ్ళు'. కాజల్ అగర్వాల్ కథానాయకుడికి సోదరిగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రాస్ ఓవర్ సినిమాగా పలు భాషలకి చెందిన నటులతో ఇది రూపొందుతోంది.
అలరిస్తోన్న విష్ణు 'మోసగాళ్ళు' టైటిల్ మోషన్ పోస్టర్ - మంచు విష్ణు
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న చిత్రం 'మోసగాళ్ళు'. తాజాగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసింది చిత్రబృందం.
మంచు విష్ణు 'మోసగాళ్లు' టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్
తాజాగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ని సామాజిక మాద్యమాల ద్వారా ఆవిష్కరించారు."వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. భారత్‌లో మొదలై, అమెరికాని వణికించిన అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో సాగుతుంది" అని సినీవర్గాలు తెలిపాయి.
Last Updated : Sep 19, 2020, 7:25 AM IST