'జబర్దస్త్' ఫేమ్ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్‌ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '3 మంకీస్'. ఈ సినిమా టీజర్ విడుదలైంది. విక్టరీ వెంకటేశ్ చేతులమీదుగా ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే సరదా సంఘటనల నేపథ్యంలో చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.