తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కోట్లు కాదు అభిమానుల ఆరోగ్యమే వారికి ముఖ్యం!

కోట్ల రూపాయల కోసం ప్రకటనల్లో నటిస్తూ, ప్రజలను పట్టించుకోని వారు కొందరు. కానీ అభిమానుల ఆరోగ్యమే పరమావధిగా భావించి, అలాంటి వాటికి దూరంగా ఉండేవారు మరికొందరు. అలా ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తున్నా సరే విలువలకు కట్టుబడి, ప్రచారాలకు దూరంగా ఉన్న పలువురు స్టార్స్ గురించే ఈ కథనం.

అమితాబ్
అమితాబ్

By

Published : Jun 5, 2020, 7:18 PM IST

Updated : Jun 5, 2020, 7:49 PM IST

సెలబ్రిటీలు అన్నాక పలు బ్రాండ్​లకు ప్రచారకర్తలుగా ఉండటం సాధారణమే. వారి ఆదాయాల్లో ఇవే కీలకపాత్ర పోషిస్తాయి. గుచ్చి, ప్రదా, లూయిస్ వ్యూటాన్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్​లకు అంబాసిడర్లుగా ఉన్నారు పలువురు స్టార్స్. కొంతమంది మాత్రం నైతిక విలువలకు కట్టుబడి, ప్రకటనల్లో నటించడానికి ససేమిరా అంటున్నారు. కోట్ల రూపాయలు ఇస్తామన్నా వాటిని తిరస్కరించి, తమ విలువలకే కట్టుబడిన ఆ నటులు ఎవరు? ఎందుకు వద్దనుకున్నారు.

సాయి పల్లవి

దక్షిణాది కథానాయిక సాయిపల్లవికి ఓ ఫెయిర్​నెస్ క్రీమ్ బ్రాండ్​కు ప్రచారకర్తగా ఉంటే రూ.2 కోట్లు ఇస్తామన్నారు. అయినాసరే ఆమె ఒప్పుకోలేదు. అలా చేస్తే ప్రజల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినట్లు అవుతుందన్న కారణంగా ఈ ప్రతిపాదనకు తిరస్కరించిందట ఈ భామ.

సాయి పల్లవి

అక్షయ్ కుమార్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. వరుస చిత్రాలు చేస్తూ జోరుమీదున్నారు. ఎప్పుడూ అభిమానుల శ్రేయస్సును కోరుకునే అక్కీ.. ఓ పాన్ మసాలా యాడ్​కు నో చెప్పి కోట్ల రూపాయల్ని వదులుకున్నారు.

అక్షయ్ కుమార్

అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ బిగ్​బీ ప్రచారకర్తగా ఉన్న బ్రాండ్​లు ఎన్నో. కానీ అవి ప్రజలకు ఉపయోగపడతాయంటే మాత్రమే అమితాబ్ ఆ యాడ్​ను అంగీకరిస్తారు. అయితే ఓ సందర్భంలో ఈయన్ని కలిసి చిన్నారి.. కూల్​డ్రింక్స్​ విషం లాంటివి కదా. మీరెందుకు వాటికి ప్రచారకర్తగా ఉన్నారు అని ప్రశ్నించిందట. దీంతో అప్పటి నుంచి ఆ ప్రకటనే కాకుండా శీతల పానీయాల యాడ్​లకు దూరంగా ఉన్నారు. తోటినటుల్ని అలాంటి ప్రచారాలు చేయొద్దని సూచిస్తున్నారట.

అమితాబ్

ఆమిర్ ఖాన్

బాలీవుడ్​లో మిస్టర్ ఫర్​ఫెక్ట్​గా పేరు తెచ్చుకున్నారు ఆమిర్ ఖాన్. ఆ పేరు ప్రకారమే ఏది చేసినా ఫర్​ఫెక్ట్​​గా చేస్తారు. ప్రకటనల విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయితే ఆమిర్ చాలా అరుదుగా యాడ్​ల్లో నటిస్తుంటారు. అందులోని అది ఏదైనా సమాజ హితం ఉంటేనే ఒప్పుకుంటారు. నీటి సమస్యలు, భూతాపం, పోలియో ఇలాంటి వాటికే ప్రచారకర్తగా ఉండేందుకు ఇష్టపడతారు.

ఆమిర్ ఖాన్

జాన్ అబ్రహం

బాలీవుడ్​లో ఫిట్​నెస్ ఎక్కువ ప్రాధాన్యమిచ్చే హీరోలలో జాన్ అబ్రహం ఒకరు. అందుకే ఆల్కహాల్​, పొగాకు లాంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఆ ఉత్పత్తులకు సంబంధించిన ప్రచారాల విషయంలోనూ ఆసక్తి చూపరు. అలాంటి యాడ్​లు చేసేవారు తన దగ్గరికి రావద్దంటూ జాన్ ఎప్పుడో చెప్పేశారు.

జాన్ అబ్రహం

రణ్​బీర్ కపూర్

ఎప్పుడూ సహజ సౌందర్యానికే మొగ్గు చూపుతారు హీరో రణ్​బీర్ కపూర్. అందుకే బ్యూటీ ప్రొడక్ట్స్​కు ప్రచారం చేయడం, ప్రజలను మోసం చేసినట్లేనని భావిస్తారు. ఫలితంగా అలాంటి ప్రకటనలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన ప్రేయసి ఆలియా భట్ మాత్రం ఓ ఫెయిర్​నెస్ క్రీమ్​కు ప్రచారకర్తగా ఉంది.

రణ్​బీర్ కపూర్

కంగనా రనౌత్

రణ్​బీర్ కపూర్ లాగానే కంగనా రనౌత్​.. ఫెయిర్​నెస్ ప్రొడక్ట్స్​కు సంబంధించిన​ యాడ్​లకు దూరంగా ఉంటారు. ఆ ప్రచారాలకు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినా, నైతిక విలువలకు కట్టుబడి నో చెప్పారు. అలాగే బ్రాండ్ల విషయంలోనూ కంగనా చాలా కఠినంగానే ఉంటారు. ముందుగా సంస్థ బ్యాక్​గ్రౌండ్ పరిశీలించిన తర్వాతే ప్రకటనల్లో నటించే విషయంపై గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.

కంగనా రనౌత్

అయితే పైవారందరూ వారి విలువలకు కట్టుబడి ప్రకటనలకు దూరంగా ఉంటే కొందరు మాత్రం అలాంటి వాటికి సై అంటున్నారు. హీరోయిన్ యామీ గౌతమ్​, ఆలియా భట్ ఫెయిర్​నెస్ క్రీమ్​కు, అజయ్ దేవగణ్​ పాన్ మసాలా ప్రకటనలు ఇస్తున్నారు. వీరే కాక షారుక్ ఖాన్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, షాహిద్ కపూర్, సోనమ్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా తదితరులు ప్రకటనల్లో నటిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు.

Last Updated : Jun 5, 2020, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details