తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భారతీయ నటులతో 'మనీ హైస్ట్'.. ఆ పాత్రకు మహేశ్! - మహేశ్ బాబు మనీ హైస్ట్​లో

నెట్​ఫ్లిక్స్ సిరీస్ 'మనీ హైస్ట్' అభిమానులు చాలామందే ఉన్నారు. ఈ సిరీస్​లోని పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఇందులో ఇండియన్ నటులు నటిస్తే ఎలా ఉంటుంది. ఈ సిరీస్ దర్శకుడు అలెక్స్ రోడ్రిగో ఓ ఇంటర్వ్యూలో మనీ హైస్ట్ పాత్రలకు భారతీయ నటులు ఎవరైతే సరిపోతుందో చెప్పాడు.​

మనీహైస్ట్
మనీహైస్ట్

By

Published : May 22, 2020, 5:16 AM IST

మనీ హైస్ట్​.. నెటిఫ్లిక్స్​లో వన్ ఆఫ్​ ది టాప్ సిరీస్. ఇటీవలే నాలుగో సీజన్​ విడుదలైంది. ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన అభిమానులు ఈ సీజన్ చూసి మరోసారి సంతృప్తి చెందారు. అయితే ఈ సిరీస్​లో నటించిన వారికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ పాత్రలతో పోల్చుకుంటూ ఏ హీరో సరిపోతారంటూ కొన్ని పోల్స్ కూడా నిర్వహిస్తున్నారు. అందుకు భారత్ ఏమీ మినహాయింపు కాదు.

తాజాగా ఈ సిరీస్ దర్శకుడు అలెక్స్ రోడ్రిగో ఓ భారత ఛానెల్​కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అతడే మనీ హైస్ట్​ ఇండియన్ వెర్షన్ కోసం పాత్రలను సరదాగా ఎంచుకున్నాడు.

ఇందులో ప్రొఫెసర్ పాత్రలో ఆయుష్మాన్ ఖురానా అయితే బాగుంటుందంటూ తన మనసులోని మాటను వెల్లడించాడు. అలాగే తమిళ హీరో విజయ్ కూడా ఆ పాత్రకు సరిపోతాడని చెప్పాడు. మొత్తంగా అతడు ఎంచుకున్న పాత్రలను చూద్దాం.

''మనీ హైస్ట్'​ పాత్రలకు ఇండియన్ హీరోస్'
భారతీయ నటులు మనీ హైస్ట్ పాత్రలు
విజయ్/ఆయుష్మాన్ ఖురానా ప్రొఫెసర్
మహేశ్ బాబు తమాయో
అజిత్ బొగొత
సూర్య సూరెజ్
షారుక్ ఖాన్ బెర్లిన్
రణ్​వీర్ సింగ్ డెన్వెర్

వారిని ఎంచుకోవడానికి గల కారణాలను కూడా చెప్పాడు అలెక్స్. విజయ్​ ఇంటలిజెంట్​గా కనిపిస్తున్నాడు కనుక ప్రొఫెసర్​ అని, షారుఖ్ ఖాన్.. బెర్లిన్ లాగా హ్యాండ్​సమ్​గా ఉంటాడని, సూర్య లుక్స్​లో యాక్షన్​, పోలీసు లక్షణాలున్నాయంటూ తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details