'బాహుబలి'తో దేశవ్యాప్తంగా అభిమానుల మనసు దోచుకున్న ప్రభాస్ కొత్త సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవలే 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్ కొత్త సినిమా 'సలార్' పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సంచలనంగా మారింది.
మలయాళ నటుడు మోహన్ లాల్ 'సలార్' చిత్రంలో నటించనున్నారని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మోహన్‌లాల్ పాత్ర తీరుతెన్నుల గురించి ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మోహన్‌లాల్... దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు.