'దృశ్యం' సిరీస్‌తో సూపర్‌హిట్‌గా కాంబినేషన్‌గా పేరొందిన మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్(Mohanlal)-దర్శకుడు జీతూ జోసెఫ్(Jeethu Joseph) మరో కొత్త సినిమా కోసం పనిచేయనున్నారు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కనున్న మూడో చిత్రానికి '12th మ్యాన్'(12th Man) టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని మోహన్‌లాల్‌తో పాటు చిత్ర నిర్మాణసంస్థ ఆశీర్వాద్ సినిమాస్ ట్విట్టర్లో వెల్లడించింది.
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోని పెరంబవూర్(Antony Perumbavoor) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ జరుపుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. మరోవైపు మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కాంబినేషన్లో 'బ్రో డాడీ' సినిమా తెరకెక్కనుంది.