మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ 'దృశ్యం 2'తో మరోసారి ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడానికి సిద్ధమయ్యారు. దాదాపు 40 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నా.. సినిమాల పట్ల తన నిబద్ధత, ఉత్సాహం ఇంకా చెక్కు చెదరలేదని తెలిపారు. ఒకవేళ సినిమాలు తీయడంలో అలసిపోయినట్లు అనిపిస్తే తన కెరీర్‌కు ముగింపు పలుకుతానని వెల్లడించారు.
మోహన్‌లాల్ హీరోగా నటించిన 'దృశ్యం 2' ట్రైలర్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలవనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు మోహన్‌లాల్. ఈ క్రమంలోనే తన కెరీర్ గురించి మాట్లాడారు. 'ఇన్నేళ్ల కెరీర్లో మీకు సినిమాలు ఒక వృత్తి, ఇక చాలు?' అని ఎప్పుడూ అనిపించలేదా అని ఒకరు ప్రశ్నించగా.. అలా అనిపిస్తే తక్షణమే కెరీర్‌కు ముగింపు పలుకుతా అంటూ సమాధానమిచ్చారు.