తెలంగాణ

telangana

ETV Bharat / sitara

22 కిలోల బరువు తగ్గిన స్టార్‌హీరో కుమార్తె! - 22 కిలోల బరువు తగ్గిన విస్మయ

మలయాళీ నటుడు మోహన్​లాల్​ కుమార్తె విస్మయ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేశారు. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఆమె.. 22కిలోల బరువు తగ్గారు. థాయ్​లాండ్​లో 'మార్షల్​ ఆర్ట్స్​' శిక్షణ తీసుకుని తాను ఇలా మారానని ఆమె చెబుతున్నారు.

Mohanlal daughter vismaya losses 22 kgs weight and shared her journey of transformation
22కిలోల బరువు తగ్గిన స్టార్‌హీరో కుమార్తె

By

Published : Dec 19, 2020, 1:49 PM IST

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పేరుపొందిన అగ్రకథానాయకుడు, మలయాళీ నటుడు మోహన్‌లాల్‌ కుమార్తె విస్మయ.. తాజాగా నెటిజన్లను షాక్‌కు గురిచేశారు. థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న విస్మయ.. సోషల్‌మీడియా వేదికగా అరుదుగా అభిమానులకు అందుబాటులో ఉండేవారు. అప్పుడప్పుడూ తన ఫొటోలను కూడా షేర్‌ చేసేవారు. చూడడానికి బొద్దుగా కనిపించే విస్మయ.. తాజాగా బరువు తగ్గి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.

ఫిట్‌నెస్‌, మార్షల్‌ ఆర్ట్స్ ట్రైనర్‌ దగ్గర కఠినమైన శిక్షణ తీసుకుని ఆమె 22 కిలోల బరువు తగ్గారు. ఈ మేరకు తాజాగా తన ఇన్‌స్టా వేదికగా ఒకప్పటి-ఇప్పటి లుక్స్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్‌కు సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. ఆమె శిక్షణ చూసి అందరూ 'వావ్‌ మేడమ్‌.. మీ కష్టానికి ప్రతిఫలం లభించింది' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

"ఫిట్‌కో థాయ్‌లాండ్‌లో గడిపిన ప్రతిక్షణానికి ఇప్పుడు నేను ఎంతో సంతోషిస్తున్నా. ఇక్కడ శిక్షణ ఇచ్చే ప్రతి ఒక్కరూ ఎంతో మంచివారు. మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్‌లో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆరంభంలో అసలు నేను ఏం చేయాలో, చేస్తానో లేదో అనే అంశాలపై నాకు సరైన స్పష్టత లేదు. కొన్నేళ్ల క్రితం కొంచెం ఎక్కువ మెట్లు ఎక్కితేనే ఊపిరాడక ఇబ్బందిపడేదాన్ని. అప్పటి నుంచే బరువు తగ్గాలనే ఆలోచనలో ఉన్నా. కానీ ఇప్పుడు, శిక్షణ తీసుకుని 22 కిలోల బరువు తగ్గా. నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రయాణం బాగా నచ్చింది. నా కోచ్‌ సాయం లేకుండా నేనిదంతా సాధించలేను. ట్రైనింగ్‌ విషయంలో ఆయన నాకెంతో సాయం చేశారు. ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు.. ఇది నేను చేయలేననే ఆలోచన నాకెన్నోసార్లు వచ్చింది. కానీ ఆయన.. నేను ఏదైనా చేయగలను అనేలా చేశారు."

-విస్మయ, మోహన్​లాల్​ కుమార్తె

కేవలం బరువు తగ్గడానికే కాకుండా ఈ మార్షల్​ ఆర్ట్స్​ శిక్షణ తనను ఎన్నో విధాలుగా మార్చిందని తెలిపింది విస్మయ.

ఇదీ చూడండి:'సీమ ఓబులమ్మ'గా రకుల్​ప్రీత్​ సింగ్​!

ABOUT THE AUTHOR

...view details