మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటిస్తున్న 'ఆరట్టు' సినిమాలో టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఇందులో ఆయనే సొంతంగా తెలుగులో డైలాగ్ చెప్పడం విశేషం. ఈ సినిమాకు ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించగా.. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు.
తెలుగులో మోహన్‌లాల్ డైలాగ్.. ట్రైలర్ టైమ్‌తో 'ఇష్క్' - తేజ సజ్జా ఇష్క్ ట్రైలర్
కొత్త అప్డేట్స్ వచ్చాయి. మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ నటించిన 'ఆరట్టు' తెలుగు టీజర్ విడుదలైంది. తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ నటించిన 'ఇష్క్' సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఏప్రిల్ 15న రిలీజ్ కానుంది.
![తెలుగులో మోహన్‌లాల్ డైలాగ్.. ట్రైలర్ టైమ్‌తో 'ఇష్క్' mohanlal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11400106-698-11400106-1618394209983.jpg)
మోహన్‌లాల్
తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన 'ఇష్క్' సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఏప్రిల్ 15న ఉదయం 10.30గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఏప్రిల్ 23న సినిమా విడుదల కానుంది. మలయాళ రొమాంటిక్ థ్రిల్లర్ 'ఇష్క్'కు ఇది రీమేక్. ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజు దర్శకత్వం వహించగా.. ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్గా నటించింది. మహతి స్వరసాగర్ సంగీతమందించగా.. మెగాసూపర్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
ఇదీ చూడండి: మోహన్‌లాల్ సినిమాలో ఏఆర్ రెహ్మాన్