మోహన్ బాబు(Mohanbabu) హీరోగా డైమండ్ రత్నబాబు తెరకెక్కిస్తోన్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'(Son of India). యాక్షన్ ఎంటర్‌టైన్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు ఇళయరాజా స్వరాలు సమకూరుస్తున్నారు. జూన్ 15న తొలి పాటను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మోహన్ బాబు. తన కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన 'పెదరాయుడు' చిత్రం విడుదలైన రోజునే తన కొత్త చిత్రానికి సంబంధించిన లిరికల్ వీడియో పాటను విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
'పెద్దరాయుడు' గుర్తుగా 'సన్ ఆఫ్ ఇండియా' సాంగ్ - సన్ ఆఫ్ ఇండియా లిరికల్ వీడియో సాంగ్
డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో మోహన్ బాబు(Mohanbabu) హీరోగా నటిస్తున్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'(Son of India). ఈ చిత్రానికి సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్‌ను జూన్15న విడుదల చేయనున్నట్లు తెలిపారు మోహన్‌బాబు.
!['పెద్దరాయుడు' గుర్తుగా 'సన్ ఆఫ్ ఇండియా' సాంగ్ son of india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12118537-798-12118537-1623578703081.jpg)
"1995 జూన్ 15 'పెదరాయుడు' రిలీజైన 26 సంవత్సరాల తర్వాత 2021 జూన్ 15న 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రానికి సంబంధించిన లిరికల్ వీడియో రిలీజ్ కానుండటం శుభసూచకంగా భావిస్తున్నాను. అప్పుడు 'పెదరాయుడు' చిత్రానికి నిర్మాత నేనైతే.. ఇప్పుడు ఈ 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రానికి నిర్మాత నా తనయుడు విష్ణు వర్థన్ బాబు కావడం సంతోదాయకం. 'సన్ ఆఫ్ ఇండియా'కు సంబంధించి 11వ శతాబ్దపు రఘువీర గద్యం.. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో రాహుల్ నంబియార్ స్వరంతో లిరికల్ వీడియోగా మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ పాటను మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడికి అంకితం ఇస్తున్నాను" అని అన్నారు.
ఇదీ చూడండి: చిరంజీవీ, మోహన్‌బాబుల సర్ప్రైజ్ అదిరింది!