మెగాస్టార్ చిరంజీవి- కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు మళ్లీ కలిసి నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'కొదమసింహం', 'లంకేశ్వరుడు' చిత్రాలు.. ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ 'ఆచార్య' కోసం కలిసి పనిచేయనుండటంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ విషయమై మెహన్‌బాబును చిరు సంప్రదించగా... ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో అయితేనే తాను నటిస్తానని కలెక్షన్ కింగ్ చెప్పారట. త్వరలో దీనిపై స్పష్టత రానుంది. ఈ సినిమాలో రామ్‌చరణ్.. ఓ ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు ఇటీవలే చిరు వెల్లడించారు.