తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మోహన్​బాబు ఆత్మకథ 'నా రూటే సపరేటు'! - మోహన్​బాబు ఆత్మకథ నా రూటే సపరేటు

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్​బాబు. సినిమాలతో పాటు రాజకీయ, విద్యారంగాల్లోనూ రాణిస్తున్నారు. ఆయన జీవితంలోని విషయాలను పుస్తక రూపంలో పొందుపరుస్తున్నట్లు సమాచారం. దానికి 'నా రూటే సపరేటు' అనే టైటిల్ ఖరారు చేశారట.

Mohanbabu Auto Biography name  Naa Rute Saparetu
మోహన్​బాబు ఆత్మకథ 'నా రూటే సపరేటు'!

By

Published : Mar 2, 2021, 8:26 AM IST

విలక్షణ నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్​బాబు. 500కు పైగా చిత్రాల్లో నటించి ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు. సినిమాలతో పాటు రాజకీయ, విద్యారంగాల్లోనూ రాణిస్తున్నారు. ఈ సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలను ఓ పుస్తక రూపంలో రాస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తన ఆత్మకథకు 'నా రూటే సపరేటు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. జులై 4న ఈ పుస్తకాన్ని ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా విడుదల చేయనున్నారట.

ప్రస్తుతం మోహన్​బాబు 'సన్‌ ఆఫ్‌ ఇండియా' అనే చిత్రం చేస్తున్నారు. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. విష్ణు మంచు నిర్మాత.

ABOUT THE AUTHOR

...view details