తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరుకు ప్రతినాయకుడిగా.. కలెక్షన్ కింగ్..! - చిరుకు ప్రతినాయకుడిగా.. కలెక్షన్ కింగ్

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. 'చిరు 152' పేరుతో సెట్స్​పైకి వెళ్లిన ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సినీవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

చిరు
చిరు

By

Published : Feb 4, 2020, 5:38 AM IST

Updated : Feb 29, 2020, 2:22 AM IST

'సైరా' వంటి హిట్‌ తర్వాత చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. చిరుకు జోడీగా త్రిష కనిపించబోతుంది. రామ్‌చరణ్‌ ఓ కీలక పాత్రలో మెరవబోతున్నట్లు సమాచారం. దీనికి చెర్రీ నిర్మాత కూడా. 'చిరు 152' పేరుతో సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్విరామంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది.

ఈ సినిమాలో మెగాస్టార్‌కు ప్రతినాయకుడిగా కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు కనిపించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొరటాల చిత్రాల్లో ప్రతినాయక పాత్రలు కథానాయకుడికి దీటుగా ఉంటాయి. అందులోనూ ఈ చిత్రంలో విలన్‌ పాత్ర మరింత ప్రత్యేకంగా ఉండబోతుందట. అందుకే ఈ పాత్ర కోసం మోహన్‌బాబును తీసుకుంటే ఈ చిత్రానికి మరింత ఆకర్షణ పెరుగుతుందని శివ ఆలోచన చేశాడట. అందుకే చిత్రబృందం ఇప్పటికే కలెక్షన్‌ కింగ్‌ను కలిసి కథ వివరించిందని.. ఆ పాత్ర నచ్చిన కారణంగా మెహన్​బాబు కూడా చిరుకు ప్రతినాయకుడిగా కనిపించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట.

ఈ సినిమాలో చిరు దేవాదాయ శాఖలో పనిచేసే అధికారిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో గుడి ప్రాంగణంతో కూడిన ఓ గ్రామం సెట్‌ వేస్తున్నారట. ఈ సినిమా చిత్రీకరణ 60శాతం ఈ సెట్లోనే పూర్తి చెయ్యనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి.. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా: శర్వా

Last Updated : Feb 29, 2020, 2:22 AM IST

ABOUT THE AUTHOR

...view details