Mohan babu son of india: కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సన్ ఆఫ్ సినిమా'. ఫిబ్రవరి 18న థియేటర్లలోకి రానుంది. అయితే సోషల్ మీడియాలో సినిమాపై రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ ఈ చిత్రంలో ఓ పాట కోసం ఏకంగా రూ.2 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మోహన్‌బాబు స్వయంగా చెప్పారు.
11వ శతాబ్దంలోని గద్యాన్ని పాట రూపంలో ఈ సినిమా కోసం స్వరపరిచామని మోహన్‌బాబు చెప్పారు. అయితే ఈ గీతం చేయడానికి ముందు సంగీత దర్శకుడు ఇళయరాజా సంశయించారని, అయితే చేయగలరంటూ తాను భరోసా ఇవ్వడం వల్ల ఆయన చేశారని అన్నారు. ఈ పాటలోని గ్రాఫిక్స్ కోసం దాదాపు రూ.2 కోట్లు ఖర్చు కూడా చేశామని మోహన్‌బాబు పేర్కొన్నారు.