తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'శాకుంతలం'లో దుర్వాస మహర్షిగా మోహన్​బాబు! - దుర్వాస మహర్షి పాత్రలో మోహన్​బాబు

దర్శకుడు గుణశేఖర్​ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న చిత్రం 'శాకుంతలం'. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుని ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఇందులోని దుర్వాస మహర్షి పాత్రలో ప్రముఖ నటుడు మోహన్​బాబు నటించనున్నట్లు టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

Mohan Babu roped in for key role Samantha's 'Shaakuntalam'?
'శాకుంతలం'లో దుర్వాస మహర్షిగా మోహన్​బాబు!

By

Published : Mar 18, 2021, 10:02 AM IST

సమంత ప్రధానపాత్రలో దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం 'శాకుంతలం'. మహాభారతం ఆదిపర్వంలోని ప్రేమ కావ్యం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్‌మోహన్‌ తెరపై కనిపించనున్నారు. ఇందులోని మరో కీలక పాత్ర కోసం ప్రముఖ నటుడు మోహన్‌ బాబు ఎంపికయ్యారని సినీ వర్గాల సమాచారం.

కథను మలుపు తిప్పే దుర్వాస మహర్షి పాత్రలో ఆయన నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. గుణ టీమ్‌ వర్క్స్​ పతాకంపై గుణ నీలిమ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఇప్పటికే పలు పౌరాణిక చిత్రాల్లో నటించి శెభాష్‌ అనిపించుకున్నారు మోహన్‌ బాబు. ఆయన ప్రస్తుతం 'సన్నాఫ్‌ ఇండియా' చిత్రంతో బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి:హాలీవుడ్​ సినిమాలో ఛాన్స్​ కొట్టేసిన శోభిత

ABOUT THE AUTHOR

...view details