తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మోహన్​బాబు ఏ చిత్రంలోనూ నటించడం లేదు' - ఆచార్య సెట్లో మోహన్​బాబు

మెగాస్టార్​ చిరంజీవి కొత్త చిత్రం 'ఆచార్య' సినిమాలో కలెక్షన్​ కింగ్​ మోహన్​బాబు నటిస్తున్నారని ఇటీవలే కొన్ని ఊహాగానాలు వచ్చాయి. వీటిపై స్పందించిన మోహన్​బాబు పీఆర్​వో ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు. 'సన్​ ఆఫ్​ ఇండియా' సినిమా సహా మరే చిత్రానికి మోహన్​బాబు సంతకం చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

mohan babu is not in acharya movie
'మోహన్​బాబు ఏ చిత్రంలోనూ నటించడం లేదు'

By

Published : Jan 18, 2021, 6:40 AM IST

Updated : Jan 18, 2021, 11:43 AM IST

ప్రముఖ నటుడు మోహన్‌బాబు నటించనున్న సినిమాల గురించి గత కొంతకాలంగా వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని ఆయన పీఆర్‌వో వెల్లడించారు. మోహన్‌బాబు ప్రస్తుతం 'సన్‌ ఆఫ్‌ ఇండియా'లో మాత్రమే నటిస్తున్నారని తెలిపారు.

"కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు.. ప్రస్తుతానికి 'సన్‌ ఆఫ్‌ ఇండియా' ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ఆయన ఏ ఇతర ప్రాజెక్ట్‌కు ఇంకా సంతకం చేయలేదు. ఆయన చేయనున్న సినిమాల గురించి వస్తోన్న వార్తలను ఎవరూ నమ్మకండి. ఒకవేళ ఆయన ఏదైనా ప్రాజెక్ట్‌ను ఓకే చేసి ప్రకటిస్తే.. మేము మీకు తెలియజేస్తాం"

- నటుడు మోహన్​బాబు పీఆర్​ఓ

మోహన్‌బాబు కొన్ని భారీ ప్రాజెక్ట్‌లలో నటించనున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిల్లో చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 'ఆచార్య' ఒకటి. ఇందులో మోహన్‌బాబు ఓ కీలకపాత్ర పోషించనున్నారంటూ పలు కథనాలు వచ్చాయి. అయితే సదరు వార్తలపై మోహన్‌బాబు కానీ, చిత్రబృందం నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

ఇదీ చూడండి:'ఓటీటీలు స్వీయ నియంత్రణ పాటించాల్సిందే'

Last Updated : Jan 18, 2021, 11:43 AM IST

ABOUT THE AUTHOR

...view details