తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ర‌జ‌నీ యోగ‌క్షేమాలు తెలుసుకున్న మోహ‌న్‌బాబు - ర‌జ‌నీ యోగ‌క్షేమాలు తెలుసుకున్న మోహ‌న్‌బాబు

అస్వస్థతతో రజనీకాంత్​ ఆస్పత్రిలో చేరారన్న విషయంతో నటుడు మోహన్​బాబు ఆందోళన చెందారు. రజనీ యోగక్షేమాలను తెలుసుకునేందుకు ఆయన భార్య లత, కుమార్తె ఐశ్వర్యలతో ఫోనులో మాట్లాడారు. రజనీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుసుకుని కుదుటపడ్డారు మోహన్​బాబు.

mohan babu inquiry about rajinikanth health information
ర‌జ‌నీ యోగ‌క్షేమాలు తెలుసుకున్న మోహ‌న్‌బాబు

By

Published : Dec 25, 2020, 10:58 PM IST

సూపర్​స్టార్​ రజనీకాంత్​కు అత్యంత సన్నిహితుడైన మోహన్​ బాబు.. రజనీ యోగక్షేమాలను తెలుసుకున్నారు. అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్​ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం తిరుపతిలో ఉన్న మోహన్​బాబు.. రజనీ ఆస్పత్రిలో చేరారని తెలియగానే ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయన యోగక్షేమాలను తెలుసుకునేందుకు రజనీ భార్య లత, కుమార్తె ఐశ్వర్యలకు ఫోను చేశారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు చెప్పడం వల్ల మోహన్​ బాబు కుదుటపడ్డారు.

రజనీకాంత్​తో మోహన్​బాబు (పాత చిత్రం)

రజనీకాంత్​.. మానసికంగా, శారీరకంగా దృఢమైన వ్యక్తి అని, ఆయన త్వరగా కోలుకుని, ఎప్పటిలాగే తన పనులు మొదలు పెడతారని మోహన్​ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:రజినీకాంత్​కు అస్వస్థత..​ జూబ్లీహిల్స్ అపోలోలో చేరిన సూపర్ స్టార్

ABOUT THE AUTHOR

...view details