మంచు మోహన్‌బాబు నట వారసులు మళ్లీ వరుస చిత్రాలతో బిజీ అవుతున్నారు. కొన్నాళ్లు సినిమాల నుంచి తాత్కాలిక విరామం తీసుకున్న మంచు విష్ణు, మనోజ్ రీఎంట్రీలో భారీ చిత్రాలతో సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికే విష్ణు 'మోసగాళ్లు' అనే ఓ హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ చేస్తుండగా.. తాజాగా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మరో క్రేజీ ప్రాజెక్టును ప్రకటించాడు.
రూ.60 కోట్ల బడ్జెట్ సినిమాలో హీరో విష్ణు - ప్రేక్షకుల ముందుకి రూ. 60కోట్ల బడ్జెట్ సినిమాతో విష్ణు
మంచు విష్ణు హీరోగా రూ.60కోట్ల బడ్జెట్‌తో 'భక్త కన్నప్ప' చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు మోహన్‌బాబు ప్రకటించాడు. ప్రస్తుతం 'మోసగాళ్లు' అనే ఓ హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు విష్ణు.
ప్రేక్షకుల ముందుకి రూ. 60కోట్ల బడ్జెట్‌తో విష్ణు
విష్ణు కథానాయకుడిగా దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో 'భక్త కన్నప్ప' చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు మోహన్‌బాబు ప్రకటించాడు. దీనికి సంబంధించిన నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపాడు. మోహన్‌బాబు తన నిర్మాణ సంస్థలోనే చిన్న కుమారుడు మనోజ్‌తో 'అహం బ్రహ్మాస్మి' అనే భారీ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఈ రెండు చిత్రాలు త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నాయి.
ఇదీ చూడండి : ప్రియాంక 'గ్రామీ లుక్' అదిరింది : కత్రినా
Last Updated : Mar 2, 2020, 4:29 AM IST