తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మా' ఎన్నికలకు కౌంట్​డౌన్.. మోహన్​బాబు ఆడియో మెసేజ్ - movie news

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​కు సరిగ్గా కొన్ని గంటల ముందు మోహన్​బాబు ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. ఓటు వేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి వేయాలని కోరారు.

mohan babu audio message on maa elections
మోహన్​బాబు

By

Published : Oct 9, 2021, 3:19 PM IST

'మా' ఎన్నికలకు ఒక్కరోజు ముందు సీనియర్ నటుడు మోహన్​బాబు ఓ ఆడియోను విడుదల చేశారు. తన కుమారుడు విష్ణుతో పాటు అతడి ప్యానెల్​ను గెలిపించాలని కోరారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు.

మోహన్​బాబు ఆడియో మెసేజ్

"అందరికీ నమస్కారం..47 సంవత్సరాల నుంచి నటుడిగా, నిర్మాతగా మీరందరూ ఆశీర్వదిస్తున్న మీ మోహన్​బాబుని. తెలుగు నటీనటులందరూ ఒక్కటిగా ఉందామని, అతిరధ మహారథులు పెట్టింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఎలక్షన్ లేకుండా ఏకగ్రీవంగా వెళ్దామని అప్పటి పెద్దలు కోరుకునేవారు. కానీ ఇప్పుడు కొందరు బజారున పడి నవ్వులపాలవుతున్నారు. మనసుకు కష్టంగా ఉంది. ఎవరు ఎన్ని చేసినా 'మా' ఒక కుటుంబం. మీ ఓటుహక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. కానీ ఓటు వేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి ఓటు వేయండి. మీ ఓటు.. మా అధ్యక్షుడిగా పోటీచేస్తున్న మీ కుటుంబ సభ్యుడు మంచు విష్ణు, అతడికి ప్యానెల్​కు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిమాటను విష్ణు నెరవేరుస్తాడని నాకు నమ్మకం ఉంది. విష్ణు ప్యానెల్ గెలిచిన వెంటనే, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి.. మన కష్టసుఖాలు చెప్పుకొని సహాయ సహకారాలు తీసుకుందాం. బిడ్డను ఆశీర్వదించండి" మోహన్​బాబు ఆడియోలో చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details