తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలకృష్ణ టాక్​షోలో మోహన్‌బాబు,నాగబాబు! - బాలకృష్ణ ఓటీటీలో

'ఆహా' వేదికగా(unstoppable with nbk aha) ప్రసారం కానున్న 'అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే' టాక్​ షోకు నటుడు మోహన్​బాబు తొలి సెలబ్రిటీగా హాజరయ్యారని తెలిసింది. సెట్‌లో బాలకృష్ణతో మోహన్‌బాబు దిగిన ఫొటో వైరల్‌గా మారింది. మరోవైపు, మెగా కుటుంబం నుంచి నాగబాబు ఈ షోలో పాల్గొన్నారని టాక్‌.

balayya
బాలయ్య

By

Published : Oct 26, 2021, 2:13 PM IST

పాత్ర ఎలాంటిదైనా(unstoppable with nbk aha) , జానర్‌ ఏదైనా వెండితెరపై తన నటన, వాక్‌ చాతుర్యంతో కట్టిపడేసే కథానాయకుడు బాలకృష్ణ. ఇప్పటివరకూ హీరోగా అలరించిన ఆయన వ్యాఖ్యాతగా సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. 'అన్‌స్టాపబుల్‌' అనే కార్యక్రమంలో సినీ ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేస్తూ వినోదం పంచనున్నారు(balakrishna on aha). ఈ షోకు హాజరైన తొలి సెలబ్రిటీ మోహన్‌బాబు అని సమాచారం. ఇప్పటి వరకూ బయటపెట్టని ఎన్నో విషయాల్ని ఆయన బాలకృష్ణతో పంచుకున్నారని తెలుస్తోంది(balakrishna unstoppable). సెట్‌లో బాలకృష్ణతో మోహన్‌బాబు దిగిన ఫొటో వైరల్‌గా మారింది. మరోవైపు, మెగా కుటుంబం నుంచి నాగబాబు ఈ షోలో పాల్గొన్నారని టాక్‌ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

బాలయ్య మోహన్​బాబు

"ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఎత్తు పల్లాలుంటాయి. వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే 'అన్‌స్టాపబుల్‌'. ఆ కాన్సెప్ట్‌ నాకు నచ్చింది. అందుకే ఈ కార్యక్రమం ఒప్పుకొన్నా" అని ఈ షో కర్టెన్‌ రైజర్‌ వేడుక సమయంలో నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమం ప్రముఖ ఓటీటీ 'ఆహా' వేదికగా నవంబరు 4వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.

ఇదీ చూడండి: 'ఆహా' అనిపించేలా బాలయ్య 'సింహా' సీన్ రిపీట్!

ABOUT THE AUTHOR

...view details