తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గుజరాత్​ సీఎంకు 'మోదీ' స్పెషల్ షో - screening

'పీఎం నరేంద్ర మోదీ' చిత్రం ప్రత్యేక ప్రదర్శనను గుజరాత్ సీఎం విజయ్​ రుపానీ తిలకించారు. గుజరాత్​లోని అహ్మదాబాద్​లో నిర్వహించిన స్పెషల్​ షోకు ఆయన హాజరయ్యారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

వివేక్​

By

Published : May 22, 2019, 9:06 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై తెరకెక్కిన 'పీఎం నరేంద్ర మోదీ' చిత్రాన్ని గుజరాత్​లోని అహ్మదాబాద్​లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్​రుపానీ హాజరయ్యారై, చిత్రాన్ని చూశారు. వివేక్​ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రత్యేక ప్రదర్శన సందర్భంగా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయాన్ని సాధిస్తుందని, మోదీ మళ్లీ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"ప్రధాని మోదీ బయోపిక్​లో ఆయన పాత్రను పోషించడం నా అదృష్టం. గుజరాత్ ప్రజలతో నా సాన్నిహిత్యం ఇప్పుడే మొదలైంది. మోదీ మళ్లీ ప్రధాని అవుతారు. ఆయనను మీరు(గుజరాత్ ప్రజలు) హీరోని చేశారు.. నాకు తెలిసి మోదీ ఇంతకు ముందే హీరో" - వివేక్​ ఒబెరాయ్, బాలీవుడ్ నటుడు

ఏప్రిల్​లోనే పీఎం నరేంద్ర మోదీ సినిమా విడుదల కావాల్సింది. అయితే ఎన్నికల కోడ్​ అమలులో ఉన్నందున రిలీజ్​కు అనుమతించలేదు ఎన్నికల సంఘం. ఒమంగ్ కుమార్ 'పీఎమ్ నరేంద్ర మోదీ' చిత్రానికి దర్శకత్వం వహించాడు.

ABOUT THE AUTHOR

...view details