తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మిథున్​ చక్రవర్తి కుమారుడిపై అత్యాచార కేసు - mahaakshay chakraborty

బాలీవుడ్​ దిగ్గజ నటుడు మిథున్​ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ చక్రవర్తిపై ముంబయిలో అత్యాచార కేసు నమోదైంది. వివాహం చేసుకుంటానని నమ్మించి తనపై మహాక్షయ్ పలుమార్లు అత్యాచారం చేశాడని.. తీరా పెళ్లి గురించి ప్రస్తావిస్తే ముఖం చాటేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

Mithun Chakraborty's son Mahaakshay accused of rape
మిథున్​ చక్రవర్తి కుమారుడిపై అత్యాచార కేసు నమోదు

By

Published : Oct 17, 2020, 2:45 PM IST

బాలీవుడ్​ సీనియర్​ నటుడు మిథున్​ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ చక్రవర్తిపై అత్యాచార ఆరోపణలతో ఓషివారా పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. వివాహం చేసుకుంటానని నమ్మించి 2015 నుంచి తనపై అతడు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పాడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తీరా పెళ్లి గురించి ప్రస్తావిస్తే అంగీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. గర్భం దాల్చిన తర్వాత దాన్ని తీపించుకోవాల్సిందిగా మహాక్షయ్ తనపై ఒత్తిడి తెచ్చాడని తెలిపింది.

బుల్లితెర నటి మదాలస శర్మతో 2018లో మహాక్షయ్​ చక్రవర్తి వివాహం జరిగింది. ఆ సమయంలో అతడిపై బాధితురాలు ఫిర్యాదు చేయగా.. దానిపై పోలీసులు ఎలాంటి ఎఫ్​ఐఆర్​ నమోదు చేయలేదు. దీంతో దిల్లీలోని రోహిణి కోర్టును బాధితురాలు ఆశ్రయించగా..మహాక్షయ్ చక్రవర్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details