కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ విధించినప్పటి నుంచి సినీ సందడి మూగబోయింది. షూటింగ్‌లు నిలిచిపోయి... థియేటర్లకు తాళం పడింది. అయితే ఇటీవల న్యూజిలాండ్ దేశం కొవిడ్‌పై విజయం సాధించడం వల్ల అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. సినిమా షూటింగ్‌లు, థియేటర్లలో చిత్రాలు విడుదలవుతున్నాయి. కరోనా విరామం తర్వాత అక్కడ మొదటిసారిగా విడుదలైన చిత్రం తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు నిర్మించిన చిత్రం 'మిస్టేక్ ఏక్ గల్తీ' కావడం విశేషం.
ఈ చిత్రాన్ని తెలంగాణకు చెందిన తుక్కాపురం సంతోష్, దేవరకొండ వికాస్ నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకుడిగా సంతోష్, ఎడిటర్‌గా వికాశ్ పనితీరు ఆకట్టుకుంది.