తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Missing movie 2021: 'ఆ విషయంలో చిరు, పవన్​ స్ఫూర్తి' - Missing movie updates

యువ నటుడు హర్షా నర్రా కథానాయకుడుగా (Missing movie 2021) శ్రీని జ్యోసుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిస్సింగ్. ఈ సినిమా నవంబర్​ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈటీవీతో హర్షా తన అనుభవాలను పంచుకున్నాడు.

Missing movie release date
మిస్సింగ్ మూవీ

By

Published : Nov 17, 2021, 5:35 AM IST

సస్పెన్స్ థ్రిల్లర్ 'మిస్సింగ్'లో యువ నటుడు హర్షా నర్రా

సినీ పరిశ్రమలో జయాలు, అపజయాలు ఎన్ని ఎదురైనా ధైర్యంగా (Missing movie updates) నిలబడి ఎదుర్కోడానికే వచ్చానని యువ నటుడు హర్షా నర్రా ధీమా వ్యక్తం చేశాడు. కొత్త నటీనటులకు విజయం కంటే ఓటములే ఎక్కువ పలకరిస్తాయని అన్నాడు. నటుడిగానే తన జీవితాన్ని కొనసాగిస్తానని తెలిపాడు. సస్పెన్స్ థ్రిల్లర్ మిస్సింగ్ చిత్రంతో ఈ నెల 19న హర్ష కథానాయకుడిగా (Missing movie release date) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఈటీవీతో హర్షా తన అనుభవాలను పంచుకున్నాడు.

దివంగత నటులు దీక్షితులు వద్ద నటనలో ఓనమాలు నేర్చుకున్న హర్షా.. శిక్షణలో ఉండగా అక్కినేని నాగేశ్వరరావు నుంచి బంగారు పతకం అందుకున్నాడు. పలు లఘు చిత్రాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా తన స్నేహితుడు శ్రీని జ్యోసుల దర్శకత్వంలో తొలి చిత్రం మిస్సింగ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నటనలో చిరంజీవి, పవన్ కల్యాణ్ తనకు ఎంతో స్ఫూర్తిగా నిలిచారంటున్నాడు. మిస్సింగ్ చిత్రం ఇంటిల్లిపాదిని అలరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి:Movie Updates: 'పుష్ప' సాంగ్​ ప్రోమో.. దుమ్మురేపుతున్న 'నాటు నాటు'

ABOUT THE AUTHOR

...view details