69వ మిస్ యూనివర్స్ పోటీలు అమెరికాలోని ఫ్లొరిడాలో ఘనంగా ముగిశాయి. 2020కుగానూ మిస్ యూనివర్స్ కిరీటం మిస్ మెక్సికో ఆండ్రియా మెజాను వరించింది. ఈ పోటీలు గతేడాది జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడ్డాయి.
ఈ అందాల పోటీల్లో జులియా గామా(బ్రెజిల్) తొలి రన్నరప్‌గా నిలవగా.. జానిక్ మెకెతా(పెరు) రెండో, అడ్లైన్ క్యాస్టిలినొ(భారత్) మూడో, కింబర్లీ రెరెజ్(డొమినిక్ రిపబ్లిక్) నాలుగో రన్నరప్‌గా నిలిచారు.